Home Page SliderTelangana

మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్ ఫలితాలు, ఉదయం 11 గంటలకే..!

తెలంగాణలో విద్యార్థుల నిరీక్షణ ముగిసింది. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) మార్చి 2024లో జరిగిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల (1వ & 2వ సంవత్సరం) ఫలితాలను ప్రకటించడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫలితాలు మరికాసేపట్లో వెల్లడికానున్నాయి. తెలంగాణ బోర్డు TS 1వ సంవత్సరం 2024 బోర్డు పరీక్షలను ఫిబ్రవరి 28 నుండి మార్చి 18 వరకు మరియు TS ఇంటర్ 2వ సంవత్సరం పరీక్షలను ఫిబ్రవరి 29 నుండి మార్చి 19 వరకు నిర్వహించింది. అధికారిక ప్రకటన తర్వాత విద్యార్థులు తమ స్కోర్‌లను అధికారిక TSBIE వెబ్‌సైట్ – https://tsbie.cgg.gov.in/లో ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు.