కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ దద్దరిల్లిన తెలంగాణ అసెంబ్లీ..
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మాటల యుద్ధంతో అసెంబ్లీ హీటెక్కింది. అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య డైలాగ్ వార్ తారాస్థాయికి చేరింది. ఇరువర్గాల మధ్య మాటలు తూటాలు పేలాయి. దీంతో అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. గవర్నర్ ప్రసంగాన్ని చాట్ జీపీటీ ఏఐ వాటి తయారు చేశారని ఆరోపించారు. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై అధికార పార్టీ సభ్యులు సీరియస్ అయ్యారు. సభ నిబంధనలు ప్రకారం నడుచుకోవాలని జగదీష్ రెడ్డికి స్పీకర్ సూచించారు.
దీనికి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఈ సభ మనందరిది.. ఇక్కడ అందరికి సమాన హక్కు ఉంటది. అంతే తప్ప అసెంబ్లీ అనేది కాంగ్రెస్ పార్టీ ఒక్కరిదే కాదు. మా అందరి తరుఫున పెద్ద మనిషిగా స్పీకర్ గా మీరు కూర్చొన్నారు.. ఈ సభ మీ సొంతం కాదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ పై జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు ఫైర్ అయ్యారు. దళిత స్పీకర్ ను అవమానిస్తారా..? ఆయన మాటలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. సభ సంప్రదాయాలకు విరుద్ధంగా నేను ఏ: మాట్లాడానో చెప్పాలి. స్పీకర్ ప్రశ్నించడం సభా సంప్రదాయాలకు విరుద్ధం కాదని అన్నారు. తాను స్పీకర్ అధికారం గురించి మాట్లాడానని చెప్పారు. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలతో సభలో తీవ్ర దుమారం రేపడంతో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.