తారకరత్న స్వయంగా శ్వాస తీసుకుంటున్నాడు : రామకృష్ణ
ఇటీవల గుండెపోటుకు గురైన తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై నందమూరి రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. నిన్నటితో పోల్చితే తారకరత్న కొద్దిగా కోలుకున్నాడని ఆయన వెల్లడించారు. డాక్టర్లు లైఫ్ సపోర్ట్ సిస్టమ్ మద్దతును కొద్దిగా తగ్గించారని, మందుల వాడకం కూడా కొద్దిగా తగ్గించారన్నారు. అన్నింటికన్నా శుభపరిణామం ఏమిటంటే, తారకరత్న తనకు తానుగా శ్వాస తీసుకుంటున్నాడని నందమూరి రామకృష్ణ వివరించారు. ఇది తమకు చాలా సంతోషం కలిగించిందన్నారు. తారకరత్న త్వరగా కోలువాలని ఈ సందర్భంగా అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని, వారి ఆశీస్సులు తమకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు.