Home Page SliderPoliticsTelangana

గవర్నర్‌ ప్రసంగంపై వెనక్కి తగ్గిన కేసీఆర్‌ సర్కార్‌

Share with

తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్‌ బడ్జెట్‌ ఆమోదించడం లేదంటూ హైకోర్ట్‌లో వేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ను విత్‌ డ్రా చేసుకుంది. బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగం ఉంటుందని ప్రభుత్వం తరుఫు న్యాయవాది దుష్యంత్‌ ధవే కోర్టుకు తెలిపారు. గవర్నర్‌ ప్రసంగంతోనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయన్నారు. గవర్నర్‌ను విమర్శించొద్దని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని న్యాయవాది తెలిపారు. గవర్నర్‌ కూడా తన రాజ్యాంగబద్ధమైన విధులు నిర్వహిస్తారని గవర్నర్‌ తరఫు లాయర్‌ కోర్టుకు తెలిపారు.

ఫిబ్రవరి 3న సభలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుమతి కోరుతూ ఈనెల 21న గవర్నర్‌కు లేఖను పంపించింది. అయితే రాజ్‌భవన్‌ నుంచి ప్రభుత్వానికి తిరిగి లేఖ వెళ్లింది. శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టే ముందు గవర్నర్‌ ప్రసంగం ఉంటుందని… దానికి సంబంధించిన కాపీని తమకు పంపించారా? లేదా? అని రాజ్‌భవన్‌ ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడంతో… గవర్నర్‌ కూడా ఆమోదం తెలపకుండా ఉండిపోయారు. ఈ క్రమంలో బడ్జెట్‌ సమావేశాలకు సమయం దగ్గర పడటంతో ప్రభుత్వంలో అలజడి మొదలైంది. దీంతో, హైకోర్టును ఆశ్రయించింది. తాజాగా పిటిషన్‌ను విత్‌ డ్రా చేసుకుంది.