Andhra PradeshHome Page Slidermovies

తిరుమలలో ‘తండేల్’ యూనిట్..

సాయిపల్లవి, నాగ చైతన్య నటించిన ‘తండేల్’ మూవీ సూపర్ హిట్ టాక్‌తో థియేటర్లలో దూసుకుపోతోంది. దీనితో మూవీ టీం ఇటీవలే విజయోత్సవ వేడుక కూడా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. నిర్మాత అల్లు అరవింద్‌తో కలిసి హీరో నాగ చైతన్య, హీరోయిన్ సాయి పల్లవి కూడా తిరుమలలో సందడి చేశారు. హీరోయిన్ సాయి పల్లవి నటన, నృత్యాలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. ఈ చిత్ర విజయోత్సవంలో నాగార్జున మాట్లాడుతూ నాగచైతన్యకు శోభితతో వివాహం జరిగిన తర్వాత విజయం వరించడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు.