తెలుగులో ప్రమాణం చేసిన తమిళనాడు ఎంపీ
తెలుగు ఖ్యాతి మరింత విస్తరిస్తోంది. ఏపీ, తెలంగాణ ఎంపీలే కాకుండా తమిళనాడు కృష్ణగిరి కాంగ్రెస్ ఎంపీ కె.గోపీనాథ్ పార్లమెంట్‌లో తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. సభకు నమస్కారం. భారత పార్లమెంట్ లోక్‌సభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయతను చూపుతాను. జై తమిళనాడు అంటూ ఆయన ప్రమాణం చేశారు. కృష్ణగిరి కుప్పం ప్రాంతానికి సమీపంలో ఉండటంతో అక్కడ తెలుగులోనూ మాట్లాడతారు.