మహిళలపై తాలిబన్ల సరికొత్త ఆంక్షలు
మహిళల హక్కులు, స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను కాలరాస్తున్న తాలిబన్లు ఇప్పుడు వారిపై మరిన్ని ఆంక్షలకు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే మహిళలు, బాలికలు చదువు, ఉద్యోగాలపై ఉక్కుపాదం మోపిన వారు మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కనీసం వారు బయట ప్రపంచానికి కనిపించకుండా జాగ్రత్త పడాలని ప్రజలకు సూచిస్తున్నారు. తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఎక్స్ వేదికగా పెట్టిన పోస్టు నెటిజన్లను నివ్వెరపోయేలా చేస్తోంది. వంట గదులు, ఇంటి ఆవరణ, నీటి కోసం బావుల వద్దకు వచ్చే మహిళలు బయటివారికి కనిపించకుండా ఎత్తైన గోడలు కట్టాలని పేర్కొన్నారు. పైగా వంట గదులకు కిటికీలు పెట్టకూడదని, ఇప్పటికే ఉన్న ఇళ్లలోని కిటికీలు తీసివేయాలని ఆదేశిస్తున్నారు.

