ఏపీలో తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్…ఛైర్మన్ హామీ
ఆంధ్రప్రదేశ్‌లో టాటా సంస్థలకు చెందిన ఇండియన్ హోటల్స్ ప్రారంభిస్తామంటూ టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ చంద్రశేఖరన్ హామీ ఇచ్చినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. విశాఖలో కొత్తగా టీసీఎస్ కంపెనీ ద్వారా ఐటీ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని, 10 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఛైర్మన్ పేర్కొన్నారు. రాష్ట్రం మొత్తం మీద 20 హోటల్స్ ఏర్పాటు చేయబోతున్నామని, వాటిలో తాజ్, వివాంతా, గేట్ వే, సెలెక్టియన్స్, జింజర్ వంటి తాజ్ గ్రూప్‌కు చెందిన హోటల్స్ ఉంటాయని పేర్కొన్నారు.

