ఆసుపత్రిలో ఠాగూర్ తరహా ఘటన..సీరియస్ అయిన మంత్రి
హైదరాబాద్ నగరంలోని మదీనాగూడ సిద్ధార్థ్ ఆసుపత్రిలో ఠాగూర్ చిత్రం తరహాలో మృతదేహానికి చికిత్స చేసిన ఘటన జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆసుపత్రిలో మృతదేహానికి రెండు రోజులు చికిత్స చేసినట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. దీనితో వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణకు అధికారులను ఆదేశించారు. దీనితో ఆరోగ్య శాఖ అధికారులు ఆసుపత్రికి చేరుకుని తనిఖీలు నిర్వహిస్తున్నారు.

