దర్శనాల దందా కేసులో సస్పెన్షన్
విజయవాడలోని ప్రముఖ శైలక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీకనకదుర్గామల్లేశ్వరస్వామి ఆలయ వీఐపీ దర్శనాల దందా కేసులో .. ఇద్దరు ఆలయ ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు ఆరుగురిపై వేటు పడగా , మరికొంత మందిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది.దళారి ఫోన్ నుంచి భారీ ఎత్తున నగదు బదిలీ అయినట్లు విచారణ అధికారులు గుర్తించారు. ఆలయ సిబ్బంది ప్రమేయంతోనే ఈ దందా జరిగినట్లు నిర్థారణ అయ్యింది.ఈ కేసులో విచారణ కొనసాగుతుంది.