Home Page SliderNationalNews Alert

సుష్మా స్వరాజ్‌ కుమార్తె పొలిటికల్‌ ఎంట్రీ..

కేంద్ర మాజీ మంత్రి దివంగత సుష్మా స్వరాజ్‌ కూతురు బన్సూరీ స్వరాజ్‌ పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చారు. ఢిల్లీ బీజేపీ లీగల్‌ సెల్‌ కో కన్వీనర్‌గా సోమవారం నియమితులయ్యారు. బన్సూరీ స్వరాజ్‌ వార్‌విక్‌ యూనివర్సటీలో ఇంగ్లిష్‌ సాహిత్యంలో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం.. లండన్‌ బీవీపీ లా స్కూల్‌లో న్యాయవిద్యను అభ్యసించారు. ఆ తరువాత ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో మాస్టర్స్‌ చేశారు. ప్రస్తుతం హరియాణా రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్‌ జనరల్‌గా బన్సూరీ సేవలందిస్తున్నారు. మొత్తానికి సుష్మా స్వరాజ్‌ వారసత్వాన్ని అంది పుచ్చుకుని రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆమె.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదా? మరికొంత కాలం వేచి చూడాలి మరి.