బుల్డోజర్ జస్టిస్ పై సుప్రీం కీలక తీర్పు
ఆక్రమణల పేరిట బుల్డోజర్లతో ఇళ్లను కూల్చడం నేరమని భారత అత్యున్నత న్యాయస్థానం(సుప్రీం కోర్టు) బుధవారం తీర్పునిచ్చింది. యూపిలో ఇళ్ల కూల్చివేతలపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఇళ్లు కూల్చడం అనేది నివశించే హక్కుని కాలరాయమే అవుతుందని, ఒక వేళ దోషిగా తేలినా సరే దానికి తగిన శిక్ష ఉంటుందే గానీ ఇలా ఇళ్లు కూల్చాలని చట్టంలో ఎక్కడా లేదని పేర్కొంది. నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చడం సరికాదని,సమగ్ర విచారణ ముగియకుండానే నిందితుణ్ణి దోషిగా తేల్చలేమని సుప్రీం స్పష్టం చేసింది. ఈ తీర్పు సెగ హైద్రాబాద్ లో హైడ్రా పేరుతో జరుగుతున్న విధ్వంసానికి కూడా వర్తించేలా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

