బుల్డోజర్ యాక్షన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
అక్రమ కట్టడాల విషయంలో తగ్గేదే లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బుల్డోజర్ యాక్షన్‌పై మతాలతో సంబంధం లేకుండా అందరికీ వర్తిస్తాయని పేర్కొంది. మందిరం, మసీదు, చర్చి, దర్గా వంటి మతపరమైన కట్టడాలను కూడా అవి పబ్లిక్ రోడ్, ఫుట్‌పాత్, వాటర్ బాడీ, రైల్వే లైన్లలో ఉంటే వాటిని తొలగించాల్సిందేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మనది సెక్యులర్ కంట్రీ. అనధికార నిర్మాణాలకు ఒకటే చట్టం. వాటికి మతాలతో సంబంధం లేదు అని వివరించింది.

