Home Page SliderInternationalNews AlertSports

వరుణ్ సూపర్ బౌలింగ్..రెండో బంతికే హెడ్ అవుట్

భారత్, అసీస్‌ల మధ్య కీలకమైన సెమీఫైనల్స్ మొదలయ్యింది. టాస్ గెలిచిన అసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా టెన్షన్ పడుతున్న ట్రావిస్ హెడ్‌ను తన సూపర్ బౌలింగ్‌తో పెవిలియన్‌కు పంపారు వరుణ్ చక్రవర్తి. న్యూజిలాండ్ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసి, సంచలనం సృష్టించిన వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి 39 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వికెట్ కోల్పోయాడు హెడ్. ప్రస్తుతం క్రీజులో స్టీవ్ స్మిత్(23), లబుషేన్(4) పరుగుల వద్ద ఉన్నారు. 14 ఓవర్లకు అసీస్ స్కోర్ 72 పరుగులకు 2 వికెట్ల నష్టంతో అసీస్ కొనసాగిస్తోంది.