Breaking NewscrimeHome Page SliderTelangana

ఎగ్జామ్స్ ఫోబియాతో సూసైడ్‌

పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమోన‌నే భయంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్ప‌డిన ఘ‌ట‌న తీవ్ర క‌ల‌క‌లం రేపింది.మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం షెట్ పల్లి గ్రామానికి చెందిన హాసిని (18) చెన్నూరులోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఇంటర్మీడియట్ చదివింది. చదువు ఇష్టం లేక ఇంటికి రావడంతో విద్యార్థిని తండ్రి ఆమెను బలవంతంగా మంచిర్యాలలోని ప్రైవేట్ కళాశాలలో చేర్పించాడు .అయితే ఇంటర్ పరీక్షలు దగ్గర పడుతుండడంతో, ఫెయిల్ అవుతానని భయపడ్డ విద్యార్థిని ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్ప‌డింది.