ఒకే ఇంట్లో తండ్రి, 4గురు కుమార్తెల ఆత్మహత్య
దేశరాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. వసంతకుంజ్ ఏరియాలోని ఒక ఇంట్లో తండ్రి, 4గురు కుమార్తెలు ఆత్మహత్య చేసుకోవడం సంచలనం కలిగించింది. ఈ దుర్ఘటనలో తాంత్రిక పూజలు జరిగాయని అనుమానిస్తున్నారు. మృతుల మెడ, మణికట్టు వద్ద పసుపు, ఎరుపు దారాలు ఉన్నట్లు గుర్తించారు. వీరు విషం కలిపిన స్వీట్లు తిని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఇంటి ఓనర్ ఈ విషయం గుర్తించారు. ఇంటిలో నుండి దుర్వాసన రావడం, రెండు రోజులుగా తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫోన్ చేయగా, ఈ విషయం బయటపడింది. పోలీసులు తలుపులు తెరిచి చూడగా హీరాలాల్ శర్మ(46) అతని కుమార్తెలు నీతూ(26), నిక్కి(24),నీరూ(23),నిధి (20) నేలపై మృతజీవులుగా కనిపించారు. అతడి భార్య ఏడాది క్రితమే క్యాన్సర్‌తో మరణించిందని, అతడు కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడని, అతని ఆఖరి కుమార్తెకు అంగవైకల్యం ఉందని సమాచారం. ఆర్థిక సమస్యలే ఈ ఆత్మహత్యలకు కారణంగా అనుమానిస్తున్నారు.