ప్రజలను వేధిస్తున్న లోన్ యాప్‌లపై కఠిన చర్యలు
రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ లేవనెత్తిన జీరో అవర్ అంశంపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. సులువుగా రుణాలు అందింది… ఆ తర్వాత ప్రజలను మోసం చేస్తున్న చైనా మొబైల్ యాప్‌లపై కఠినంగా వ్యవహరిస్తామని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖలు, రిజర్వ్ బ్యాంకు సమన్వయంతో చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై సెంట్రల్ బ్యాంక్ ప్రతినిధులు.. ఫైనాన్స్ అధికారులు పలుసార్లు సమావేశాలు నిర్వహించి సమీక్షించారని సభకు వివరణ ఇచ్చారు. లోన్ యాప్‌లతో ప్రజలను వేధిస్తున్న వారిని, సంస్థలను ఎవరినీ కూడా ఉపేక్షించబోమని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.