కలెక్టర్ కారుపై రాళ్ల దాడి..అధికారులపై పిడిగుద్దులు
కలెక్టర్ ని తిట్టారు…ఆయన కారుపై రాళ్లు రువ్వారు …రెవిన్యూ అధికారులనైతే కర్రలతో కొట్టిన చోట కొట్టకుండా కొట్తారు…మరికొంత మంది అధికారులపై పిడుగుద్దుల వర్షం కురిపించారు.ఇది ఎవరో నక్సల్ పనో తీవ్ర వాదుల పనో అనుకునేరు…సాక్షాత్తు ఓ తండా వాసులు సాగించిన ఆవేదనాభరిత విధ్వంసం. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ అనుమతులు పరిశీలించేందకు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తన సిబ్బందితో గ్రామానికి చేరుకున్నారు.అభిప్రాయ సేకరణ చేస్తుండగా వద్దంటూ వాదనలు విపించారు గ్రామస్థులు.అయినా ఫార్మా కంపెనీ పెడతారంటూ చెప్పీ చెప్పగానే వెనుక నుంచి రాళ్లు రువ్వారు.అదే అదనుగా భావించిన మరికొంత మంది అధికారులను పిడిగుద్దులు గుద్దారు.కర్రలు,రాళ్లతో వీరంగం సృష్టించారు.దీంతో కలెక్టర్ ప్రతీక్…బతుకు జీవుడా అంటూ కారులో పలాయనం చిత్తగించినా సరే వదలకుండా ఆయన కారు అద్దాలను కూడా ధ్వంసం చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.