విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రాష్ట్ర ప్రభుత్వ అండ
విశాఖ ఉక్కు కర్మాగారానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఊరట కల్పించింది. విద్యుత్ ఛార్జీల భారం నుంచి ఉపశమనం కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
EPDCLకు ప్లాంట్ చెల్లించాల్సిన రూ. 754 కోట్ల బకాయిలతో పాటు, వచ్చే రెండేళ్లలో చెల్లించాల్సిన విద్యుత్ ఛార్జీలు కలిపి మొత్తం రూ. 2,400 కోట్లను ఆర్‌ఐఎన్‌ఎల్ (RINL) లో ఈక్విటీ పెట్టుబడిగా మలచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మొత్తాన్ని నాన్ క్యుములేటివ్ రిడీమబుల్ ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్ రూపంలో EPDCLకు బదిలీ చేయడానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఈ నిర్ణయంతో విశాఖ ఉక్కు కర్మాగారానికి ఆర్థిక ఊరట లభించనుందని, ఉత్పత్తి కార్యకలాపాలకు ఊపిరి లభించనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.