కోటప్పకొండకు రాష్ట్ర పండుగ హోదా
ఏపీలోని కోటప్పకొండలో శివరాత్రి ఉత్సవాలకు రాష్ట్రపండుగ హోదాలో ఘనంగా నిర్వహిస్తామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. శివరాత్రి సందర్భంగా ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించారు గొట్టిపాటి. ఈ ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. క్యూలైన్లు, తాగునీరు, రవాణా, శానిటేషన్ వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

