Home Page SliderInternational

బ్రిటన్ కొత్త ప్రధానిగా స్టార్మర్ నియామకం

బ్రిటన్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అభ్యర్థి కైర్ స్టార్మర్ ప్రధానిగా గెలిచిన విషయం తెలిసిందే. ఈ మేరకు స్టార్మర్ ఈ రోజు బ్రిటన్ ప్రధానిగా నియమితులయ్యారు.కాగా బ్రిటన్ రాజు ఛార్లెస్ బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు స్టార్మర్‌ను ఆహ్వానించి ప్రధానిగా నియమిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. దీంతో లేబర్ పార్టీ నుంచి ప్రధానిగా ఎన్నికైన ఏడో వ్యక్తిగా స్టార్మర్ నిలిచారు. ఈ నేపథ్యంలో లండన్‌లోని డౌనింగ్ స్ట్రీట్‌లో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో స్టార్మర్ ఆయన భార్యతో కలిసి పాల్గొననున్నట్లు తెలుస్తోంది.