శ్రీవారి గరుడసేవ…ట్రాఫిక్ మళ్లింపులు
తిరుపతి : శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహన సేవ రోజు భారీగా ప్రజలు తరలివస్తారు. ఆదివారం రాత్రి గరుడసేవకు టీటీడీ పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో తిరుపతి పోలీసులు తిరుమల, తిరుపతి, ఇతర పరిసర పట్టణాలలో ట్రాఫిక్ కిక్కిరిసి పోకుండా పలు కీలక సూచనలు చేశారు. శ్రీవారి ఇష్టవాహనమైన గరుడ సేవ చూసేందుకు జిల్లా నుంచే కాకుండా, దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి కూడా యాత్రికులు, భక్తులు భారీగా తరలివస్తారు. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమలలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పోలీసులు తెలిపారు. సెప్టెంబర్ 27న రాత్రి 9 గంటల నుండి 29న ఉదయం 6 గంటల వరకు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలు రద్దు చేయబడ్డాయి. అలిపిరి పాత చెక్ పోస్ట్ వద్ద ద్విచక్ర వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ సదుపాయం కల్పించబడుతుంది.
. తిరుమలలో పెద్ద బ్యాడ్జెస్ వీఐపీల కోసం రాంభగీచ యాత్రికుల సముదాయం వద్ద పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు. విఐపి చిన్న బ్యాడ్జెస్ వాహనాల కోసం సప్తగిరి గెస్ట్ హౌస్ వద్ద పార్కింగ్. ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా కేటాయించిన పార్కింగ్ ప్రాంతాలకు సాధారణ వాహనాలు పార్క్ చేసుకోవచ్చు.
• . తిరుపతి నుండి తిరుమల వరకు APSRTC, TTD ప్రత్యేక బస్సులు నిరంతరం నడపబడతాయి. భక్తులు వీటినే వినియోగించాలి. అలిపిరి – కపిలతీర్థం మార్గం – భక్తుల రాకపోకల కోసం ప్రత్యేకంగా ఉంచబడింది. ప్రైవేట్ వాహనాలకు పరిమితులు ఉంటాయి. RTC బస్ స్టాండ్ – అలిపిరి రోడ్ – వాహన రాకపోకలకు కేటాయించిన మార్గాలు మాత్రమే ఉపయోగించాలి. భక్తులు RTC బస్సులు/TTD వాహనాలను వినియోగించాలి.
• కడప, శ్రీకాళహస్తి వైపు నుండి వచ్చే వాహనాలకు ఇస్కాన్ గ్రౌండ్, నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్, భారతీయ విద్యాభవన్ గ్రౌండ్ లలో టూ వీలర్, ఫోర్ వీలర్ పార్కింగ్ సదుపాయం కలదు.
• చిత్తూరు, పీలేరు, ఇతర జిల్లాల నుండి వచ్చే టూరిస్టు వాహనాలు, టెంపో ట్రావెల్స్ వాహనాలకు దేవలోక్ ప్రాంగణంలో పార్కింగ్ సౌకర్యం ఉంది.
• మదనపల్లి, చిత్తూరు నుండి వచ్చే వాహనాలకు భారతీయ విద్యాభవన్, నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్, ఇస్కాన్ టెంపుల్ గ్రౌండ్ లలో ఫోర్ వీలర్ పార్కింగ్ సదుపాయం కలదు.
• తిరుమలకు RTC బస్సుల ద్వారా ప్రయాణించే యాత్రికులు, నంది సర్కిల్ మరియు గరుడ సర్కిల్ మార్గం గుండా యథాప్రకారం తిరుమల వెళ్తారు. టూ వీలర్లలో వచ్చే యాత్రికులకు అలిపిరి బాలాజీ లింక్ బస్టాండ్ వద్ద టూ వీలర్ పార్కింగ్ చేసుకోవాలి.
• ఈ పార్కింగ్ ప్రాంతాలలో తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే త్రాగు నీరు, భోజనం, టాయిలెట్స్ సదుపాయాలు, తిరుపతి నుండి తిరుమలకు చేసుకోవడానికి 24/7 RTC బస్సు సౌకర్యం ఏర్పాటు చేయబడతాయని పేర్కొన్నారు.