Home Page SliderNational

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ… సోనియా గాంధీకి బీజేపీ కౌంటర్

మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై బుధవారం లోక్‌సభలో కాంగ్రెస్‌, బీజేపీల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ ఇతర వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు, బిల్లును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేయగా, బిజెపి ఎంపి నిషికాంత్ దూబే పార్టీ “రాజకీయ కోణాల కోసం” కొత్త మాటలు చెబుతోందని ఆరోపించారు. మహిళా శాసనసభ్యులకు రిజర్వేషన్లు వ్యవహారం విషయంలో కాంగ్రెస్, ఓబిసి కోటా గురించి ఎప్పుడూ మాట్లాడలేదని పేర్కొన్నారు. బిల్లుపై ప్రతిపక్షం నుండి మొదటి స్పీకర్‌గా, తన పార్టీ చట్టానికి మద్దతు ఇస్తుందని, అయితే మహిళలకు 33% కోటాలో ఇతర వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించాలని సోనియాగాంధీ డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లపై తొలిసారిగా తన భర్త రాజీవ్ గాంధీ బిల్లును ప్రవేశపెట్టారని, బిల్లుపై మాట్లాడటం తనకు భావోద్వేగ క్షణమని ఆమె అన్నారు. కాంగ్రెస్ మాజీ చీఫ్ హిందీలో మాట్లాడుతూ, “భారత జాతీయ కాంగ్రెస్ తరపున, నేను నారీ శక్తి వందన్ అధినియమ్‌కు మద్దతుగా ఇక్కడ నిలబడి ఉన్నాను. పొగతో నిండిన వంటశాలల నుండి భారతీయ మహిళ ప్రయాణం సుదీర్ఘమైనది. చివరకు ఆమె తన గమ్యాన్ని చేరుకుంది.” అన్నారు.

స్వాతంత్య్రం, నవ భారత నిర్మాణం కోసం మహిళలు పురుషులతో భుజం భుజం కలిపి పోరాడారని, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ వల్ల ఈ బిల్లుపై మాట్లాడటం భావోద్వేగమైన ఘట్టమని సోనియా అన్నారు. మొదట నా భర్త రాజీవ్‌గాంధీ బిల్లు ప్రవేశపెట్టారు. దీనిని పివి నరసింహారావు ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించింది. రాజీవ్ గాంధీ కల ఇప్పటివరకు సగం మాత్రమే నెరవేరింది, ఈ బిల్లు ఆమోదంతో అది పూర్తిగా నెరవేరుతుందన్నారు. తమ పార్టీ బిల్లుకు మద్దతు ఇస్తుండగా, మహిళలు తమ హక్కులను పొందేందుకు ఎక్కువ కాలం వేచి ఉండాలని కొందరు చెబుతున్నారని సోనియా విమర్శించారు. ‘‘రెండు, నాలుగో, ఎనిమిదో ఏళ్ళు ఎదురుచూడాలి.. ఇది సరైందేనా? బిల్లును తక్షణమే అమలు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. కుల గణన కూడా నిర్వహించి SC, ST మరియు OBC కమ్యూనిటీల మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ప్రభుత్వం దీనికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. దీన్ని ఆలస్యం చేయడం మహిళలకు తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు.

సోనియాకు బీజేపీ కౌంటర్

ఈ బిల్లులో ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ వర్గాల మహిళలకు రిజర్వేషన్‌ కల్పించాలని సూచించిన బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దుబే, కాంగ్రెస్‌, ప్రతిపక్షాలు ఇన్నాళ్లూ బిల్లు పెట్టలేదని, ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీలు ముందడుగేసేసరికి… కంగారు పడుతున్నాయన్నారు. “ఇది సరైన సమయమని… బిల్లును ఆమోదించాలని ప్రధాని చెబుతున్నారని… బిల్లును ప్రవేశపెట్టడానికి, ఇందులోని మహిళలకు గౌరవం, రిజర్వేషన్లు ఇవ్వడానికి ఈ ప్రత్యేక సమావేశానికి పిలుపునిచ్చినందుకు గర్విస్తున్నాం. “అని చెప్పారు. కాంగ్రెస్‌పై దూబే మాట్లాడుతూ, “ఈ దేశం రాజ్యాంగంపై నడుస్తుంది. పంచాయతీలు, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టినందుకు వారు తమ వెన్ను తడుముకుంటున్నారు. వారు ఎప్పుడూ OBC రిజర్వేషన్ గురించి మాట్లాడలేదన్నారు.

రాజకీయ కోణాల కోసం కొత్త విషయాలను తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. “మీరు ఇప్పుడు 2024 నుంచే రిజర్వేషన్లు అమలు చేయాలని అంటున్నారు… జనగణన మరియు డీలిమిటేషన్ లేకుండా, రిజర్వేషన్‌ను కొట్టివేయాలనుకుంటున్నారా? మహిళా రిజర్వేషన్‌ను మీరు లాలీపాప్‌గా ఉపయోగించాలని కోరుకుంటున్నారా? తాను ప్రారంభించిన పనిని పూర్తి చేస్తానని ప్రధాని చెప్పారు. ఇప్పుడు బిల్లు పెట్టబడింది, మహిళలు వారి హక్కులను పొందుతారు దానిని ఎవరూ ఆపలేరు, ”అని అన్నారు. మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు, దేశవ్యాప్తంగా లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాంగ్రెస్‌తో సహా కొంతమంది విపక్ష సభ్యుల మద్దతుతో ఉభయ సభలు దీనిని ఆమోదించనున్నాయి.