ఏపి బీజెపి ఎమ్మెల్సీగా సోమువీర్రాజు
ఏపి బీజెపి మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు రెండో సారి ఎమ్మెల్సీ అయ్యే ఛాన్స్ కొట్టేశారు.ఆయన పేరును బీజెపి అధిష్టానం అనూహ్యంగా తెరమీదకు తెచ్చింది.చంద్రబాబు ప్రభుత్వ హయాంలో క్రియాశీలక ప్రతిపక్ష పాత్ర పోషించిన సోమువీర్రాజు విధేయతను ప్రామాణికంగా తీసుకుని మళ్లీ ఆయన్ను శాసన మండలికి పంపనుంది.చివరి నిముషంలో సోము పేరును ఖరారు చేశారు.టిడిపి కూడా బీజెపికి ఎమ్మెల్సీ ఇవ్వాలా లేదా అన్న తర్జనభర్జనల మధ్య సీటు కేటాయించింది.అయితే బీజెపి అధిష్టానికి ఎన్నో పేర్లు పరిశీలనకు వచ్చినా…సోము వైపై మొగ్గుచూపడం గమనార్హం.దీంతో ఆయన సోమవారం నామినేషన్ వేయనున్నారు.