Andhra PradeshBreaking NewsHome Page SliderNews Alert

తిరుమల నుంచి ఎర్రచంద‌నం స్మ‌గ్లింగ్‌

తిరుమ‌ల నుంచి ఎర్రచంద‌నాన్ని అక్ర‌మంగా ర‌వాణా చేస్తూ అడ్డంగా ప‌ట్టుబ‌డిపోయిందో ముఠా. ఈ భాగోతం గురువారం వెలుగుచూసింది. తిరుమల నుంచి తిరుపతికి ఎర్రచందనాన్ని వాహనంలో రవాణా చేస్తూ కొంత మంది స్మ‌గ్ల‌ర్లు పట్టుబడ్డారు. తిరుమల శిలాతోరణం నుంచి కారులో ఎర్రచందనం దుంగలను స్మగ్లర్లు తరలిస్తున్నార‌న్న స‌మాచారం మేర‌కు అటవీశాఖ అధికారులు పోలీసుల‌తో సంయుక్తంగా త‌నిఖీలు చేప‌ట్టి నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారు.దుంగ‌ల‌ను త‌ర‌లిస్తున్న‌ కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.కాగా ప‌ట్టుబ‌డిన దుంగ‌ల బ‌హిరంగ మార్కెట్ విలువ రూ.5కోట్ల‌కు పైనే ఉంటుంద‌ని పోలీసుల అంచ‌నా.తిరుమ‌ల నుంచి పెద్ద ఎత్తున ఇంత బ‌హిరంగంగా ఎర్ర‌చంద‌నం దుంగ‌లు త‌రలిస్తూ ప‌ట్టుబ‌డ‌టం ఇదే ప్ర‌ధ‌మ‌ని గ‌తంలో తిరుమ‌ల నుంచి ఇంత పెద్ద మొత్తంలో దుంగ‌లు ప‌ట్టుబ‌డ‌లేద‌ని చెబుతున్నారు.తిరుప‌తి నుంచి ఇత‌ర ప్రాంతాల‌కు దుంగ‌లు అక్రమంగా త‌ర‌లిస్తున్న ఘ‌ట‌న‌లు చూశాం..విన్నాం.కానీ ఏకంగా తిరుమ‌ల కొండ నుంచి నేరుగా కింద‌కు ర‌హ‌దారి మార్గంలో త‌ర‌లిస్తూ ప‌ట్టుబ‌డ‌టం ఇటీవ‌ల కాలంలో ఇదే ప్ర‌ధ‌మ‌మ‌ని చెప్పాలి.

Breaking news: అల్లు అర్జున్‌కి బెయిల్‌