‘బిగ్ బాస్’కు స్మాల్ బ్రేక్!: కమల్‌హాసన్
టెలివిజన్ రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా తమిళ ప్రేక్షకులకు మరింత చేరువైన విశ్వనటుడు కమల్‌హాసన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బిగ్ బాస్ తమిళ షో నుండి తాత్కాలికంగా తప్పుకున్నట్లు ప్రకటించారు. ఏడేళ్లుగా ఆయన తమిళ బిగ్ బాస్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన కమల్ సినిమా కమిట్‌మెంట్స్ వల్ల తనకి సమయం చిక్కడం లేదని తెలిపారు. ఇన్నేళ్లుగా హోస్ట్‌గా తనను సపోర్ట్ చేసిన ప్రేక్షకులకు ఆయన ధన్యవాదాలు తెలుపుతూ ఒక ప్రకటనలో తెలిపారు.