Home Page SliderTelangana

ఒకే ఫ్యామిలీలో ఆరుగురు మిస్సింగ్..

ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి మిస్సింగ్ ఘటన కలకలం రేపింది. సికింద్రాబాద్ లోని న్యూ బోయిన్ పల్లి ఏడుగుళ్లలో ఓ ఇంట్లో రేంటు ఉండే దాండ్ల మహేశ్, ఉమా దంపతులు, వారి ముగ్గురు పిల్లల తోపాటు ఉమా చెల్లెలు సంధ్య అనే మరో కుటుంబ సభ్యురాలు మిస్సింగ్ అయినట్లు పోలీసులు తెలిపారు. మహేశ్ వాటర్ సప్లై సెంటర్ లో ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. వీరి ఇంటికి ఉమా చెల్లెలు సంధ్య అనే మహిళ గురువారం ఉదయం మేడ్చల్ నుంచి వచ్చింది. మహేశ్, ఉమా.. వారి పిల్లలు రిషి, చైతు, శివన్ సంధ్య ఒకేసారి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. దీంతో ఇంటి ఓనర్ ఉమా సోదరుడు భిక్షపతికి సమాచారం ఇవ్వడంతో అతను పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆ ఆరుగురు ఆటో బుక్ చేసుకొని బోయిన్ పల్లి నుంచి ఎంజీబీఎస్ బస్ స్టేషన్ కు అక్కడి నుంచి విజయవాడకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. బాధితురాలి సోదరుడు భిక్షపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా ఆరుగురి ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు, బంధు మిత్రులను విచారిస్తున్నారు. ప్రస్తుతం వీరి మిస్సింగ్ మిస్టరీగా మారింది.