Home Page SliderNews AlertTelangana

రేవంత్‌ రెడ్డిపై సిట్‌ సీరియస్‌ యాక్షన్‌

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రేవంత్‌ రెడ్డి చేసిన ఆరోపణలపై ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదని సిట్‌ పేర్కొంది. నిరాధారమైన ఆరోపణలు చేసిన రేవంత్‌ రెడ్డిపై సీరియస్‌ యాక్షన్‌ సిట్‌ తీసుకోనుంది. న్యాయపరమైన సలహాలు తీసుకుని రేవంత్‌పై చర్యలు తీసుకునేందుకు సిట్‌ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇటీవలే రేవంత్‌ రెడ్డి ఒకే మండలంలో 100 మంది పాస్‌ అయినట్టుగా ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఇవ్వాలని సిట్‌ అధికారులు రేవంత్‌ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. మార్చి 23న విచారణకు హాజరైన రేవంత్ తన దగ్గర ఉన్న ఆధారాలను సిట్‌కు సమర్పించారు. రేవంత్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను సిట్‌ రికార్డు చేసింది. ఈ కేసుకు సంబంధించిన 13 మందిని సిట్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు.