Home Page SliderNational

“సార్..మేడమ్” వద్దు..! “టీచర్” అనే పిలుపే ముద్దు

కేరళ బాలల హక్కుల కమీషన్ ఆ రాష్ట్రంలో కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం కేరళ పాఠశాలల్లో విద్యార్ధులు ఇకపై ఉపాధ్యాయని,ఉపాధ్యాయులను సార్,మేడమ్ అని పిలువకూడదు. మరి ఏమని పిలవాలి అని అనుకుంటున్నారా? కొత్త ఆదేశాల మేరకు కేరళలో ఉపాధ్యాయని,ఉపాధ్యాయులను కేవలం “టీచర్” అని మాత్రమే సంభోదించాలి. ఆ మేరకు కేరళలోని అన్నీ ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలలకు మార్గ దర్శకాలు జారీ చేసినట్లు కేరళ బాలల హక్కుల కమీషన్ తెలిపింది. అయితే టీచర్ అనే పదం స్రీ,పురుషులు ఇద్దరికి వర్తిస్తుంది. దీంతో చిన్నప్పటి నుంచే పిల్లలకు స్రీ,పురుషులు ఇద్దరు సమానమేనని తెలిపేందుకే నూతన ఒరవడికి శ్రీకారం చుట్టినట్లు కేరళ బాలల హక్కుల కమీషన్ తన ఆదేశాల్లో పేర్కొంది. దీని ద్వారా  పాఠశాల్లో ఉపాధ్యాయులకు,విద్యార్ధులకు మధ్య ఉన్న అనుబంధం మరింత పెరిగే అవకాశముందని బాలల హక్కుల కమీషన్ అభిప్రాయపడుతున్నట్లు వెల్లడించింది.