తుపాకీతో కాల్చుకొని ఎస్ఐ ఆత్మహత్య
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రూరల్ ఎస్ఐగా పనిచేస్తున్న ఎస్సై ఎ.జి.ఎస్.మూర్తి.. ఉదయం స్టేషన్‌లో తుపాకీతో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.ఇటీవల పలు ఆరోపణల నేపథ్యంలో ఆయన సస్పెండయ్యారు. గేదెల అపహరణ కేసులో మూర్తిపై పలు ఆరోపణలు రావడంతో ఆయన్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం మూర్తి పీఎస్‌కు వచ్చి తుపాకీతో కాల్చుకున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది.పోలీసులు ఎస్సై మృతదేహాన్ని పోస్టుమార్టి నిమిత్తం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.