Home Page SliderTelangana

కంటోన్‌మెంట్ ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ ప్రమాణ స్వీకారం

సికింద్రాబాద్ కంటోన్‌మెంట్ ఉప ఎన్నికలలో గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్‌ గురువారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. కాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన లాస్య నందిత యాక్సిడెంట్‌లో చనిపోగా ఈ స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించడం జరిగింది.