సంధ్య థియేటర్‌కు షోకాజ్ నోటీసులు
తెలంగాణా పోలీసులు సంధ్య థియేటర్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. థియేటర్‌కి ఉన్న లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో 10 రోజుల్లో తిరుగు సంజాయితీ ఇవ్వాలని కోరారు.పుష్ప2 రిలీజ్ సందర్భంగా అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయిందని, మరో ప్రాణం జీవన్మరణ పోరాటం చేస్తుందని తెలిపింది.సరిగ్గా అనుమతులు లేవని,సరైన సదుపాయాలు,భద్రతా ఏర్పాట్లు చేయలేని థియేటర్ యాజమాన్యానికి దాన్ని నడిపే అర్హత కూడా లేదన్నారు. తొక్కిసలాట ఘటనలో పోలీసులు 12 లోపాలను గుర్తించారన్నారు. ఈ నెల 22లోగా వివరణ ఇవ్వకపోతే థియేటర్ లైసెన్స్ రద్దు చేసి సీజ్ చేస్తామని హెచ్చరించారు.