చాకలి పని, మంగలి పని… నేను చేయాలా? ఎమ్మెల్యే భాస్కర్ రావు
మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దళితబంధు యూనిట్ల పంపిణీ సందర్భంగా ఎంపీపీ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదంటూ మిర్యాలగూడ ఎంపీపీ నూకల సరళ ప్రశ్నించగా… అందుకు ఎమ్మెల్యే ఘాటు రిప్లై ఇచ్చారు. ఎవరు వచ్చినా, రాకున్నా కార్యక్రమం ఆగదని.. ముందుగానే వచ్చి అన్నీ చూసుకోవాలన్నారు. అన్నీ పనులు సారే చేయాలంటే ఎట్లా అంటూ ప్రశ్నించిన భాస్కరరావు, చాకలి పని, మంగళి పని అన్నీ పనులు నేనే చేయాలా అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజకులు, నాయి బ్రహ్మణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కులాలను అవమానించడమన్నది నేతలకు అలవాటుగా మారిపోయిందన్నారు. ఇటీవల నర్సాపూర్‌లోనూ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీపై ఇష్టం లేకుంటే… తామేసిన రోడ్లపై నడవొద్దన్నారు.


