Breaking NewscrimeHome Page SliderTelangana

హ‌బ్సిగూడ ఆర్కేడ్‌లో షార్ట్ సర్క్యూట్

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఇద్దరి ప్రాణాల‌ను బ‌లిగొంది.హబ్సిగూడలో విజయలక్ష్మి ఆర్కేడ్‌లో శుభానందిని చిట్ ఫండ్స్ భ‌వ‌నం నేమ్‌ బోర్డ్ తొల‌గిస్తుండ‌గా ప్ర‌మాద‌వ‌శాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జ‌రిగింది.పెద్ద ఎత్తున మంట‌లు వ్యాపించాయి. దీంతో బోర్డును తొల‌గిస్తున్న ఇద్ద‌రు వ్య‌క్తులు అక్క‌డిక‌క్క‌డే దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. హైఓల్టేజ్ ఉండ‌టం వ‌ల్ల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ దెబ్బ‌కి ఎగిరి కింద ప‌డ్డారు. మృతులు సూర్యపేట జిల్లా కే.సముద్రం గ్రామానికి చెందిన మల్లేష్(29), బాలు(32)గా గుర్తించారు.స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది,పోలీసులు ఘ‌ట‌నా స్థలానికి చేరుకుని విద్యుత్ స‌ర‌ఫరా నిలిపివేయించి మంట‌లు ఆర్పించారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు.పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు.