కాళేశ్వరంపై విజిలెన్స్ నివేదికలో షాకింగ్ నిజాలు
గత ప్రభుత్వ కాలంలో నిర్మించిన కాళేశ్వరంప్రాజెక్టుపై విజిలెన్స్ నివేదికకు రెడీ అయ్యింది. దీనికి కమిషన్ ఆమోదం తెలిపింది. గత కొన్ని నెలలుగా సాగుతున్న ఈ విచారణలో విజిలెన్స్ కమిటీ కొన్ని షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. గత ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు కొందరు అధికారులు నిబంధనలు ఉల్లంఘించినట్టు గుర్తించారు. విజిలెన్స్ నివేదికలో 40 మంది అధికారుల పేర్లు పొందుపరిచారు. మేడిగడ్డ డ్యామ్ కుంగిపోవడానికి కూడా తగిన కారణాలను ఈ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.