క్యాన్సర్‌పై షాకింగ్ నిజాలు..
క్యాన్సర్ ముప్పుకు కారణాలు అన్వేషించే పరిశోధనలో అమెరికా శాస్త్రవేత్తలు ఒక షాకింగ్ విషయాన్ని కనిపెట్టారు. తల్లి గర్భంలో పిండం ఎదుగుతున్న దశలోనే క్యాన్సర్‌కు బీజాలు పడే అవకాశం ఉందని తేలింది. ఎలుకలపై క్యాన్సర్ సంబంధ జన్యువులపై రెండు రకాల ఎపిజెనెటిక్ ముద్రల్లో ఇది కనిపెట్టారు. దీనిలో ఒక దానిలో ఎక్కువ క్యాన్సర్ రిస్క్, మరో దానిలో తక్కువ క్యాన్సర్ రిస్క్ ఉంటుందన్నారు. లుకేమియా, లింఫోమా వంటి ద్రవ రూప ట్యూమర్ కావడానికి అవకాశం ఎక్కువ. అధిక రిస్క్ ఉన్నవారికి క్యాన్సర్ అది ఊపిరితిత్తులు, ప్రొస్టేట్ క్యాన్సర్ వంటి ఘన కణితులు కావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే అసాధారణమైన ప్రతి కణమూ క్యాన్సర్‌గా మారదని పేర్కొన్నారు. జన్యువుల పనితీరుపై ప్రభావం చూపే ప్రక్రియలను ఎపిజెనెటిక్స్‌లో సమస్యలు ఎదురైతే.. కణ నాణ్యత నియంత్రణ ప్రక్రియలు దెబ్బతింటాయి.