Home Page SliderNationalNewsviral

ఇండియాకు షాక్ …బిహార్లో సింగిల్ గానే : ఆప్

బిహార్ లో త్వరలో జరగనున్న ఎన్నికలలో ఆప్ ఒంటరిగా పోటీ చేయనన్నట్లు ప్రకటించింది. ఇండియా కూటమికి ఆప్ మరోసారి షాక్ ఇచ్చింది. బిహార్ లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరుకు సై అంటూ సిగ్నల్ ఇచ్చింది. 243 స్థానాల్లో అమ్ ఆద్మీ ఆప్ పార్టీ అభ్యర్థులను నిలబెట్టనున్నట్లు బిహార్ ఆప్ పార్టీ చీఫ్ రాకేశ్ కుమార్ ప్రకటించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఆప్ సైలెంట్ ను మెయింటైన్ చేస్తోంది. చెప్పుకోదగ్గ రాజకీయ పోరాటలయితే ఏమి లేకుండా స్తబ్ధతగా రాష్ట్ర రాజకీయ ఆంశాలపై నిశితంగా పరిశీలింస్తోందని అధిష్టానం చెప్పుకొస్తుంది. ఇటీవలే బిహార్ ఎన్నికల కోసం పార్టీ అధినాయకత్వం పొలిటికల్ వ్యూహా ప్రణాళికను రచించినట్లు ఆపార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకోసమే ధీమాగా ఎన్నికల్లో సింగిల్ వస్తామంటూ సంకేతాలు ఇస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఆప్ ఎలాంటి పొలిటికల్ స్కేచ్ వేయనుందో వేచిచూడాల్సిందే.