Andhra PradeshHome Page Slider

నెల్లూరులో వైసీపీకి షాక్

ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీకి భారీ షాక్ తగిలిన విషయం తెలిసిందే. అయితే ఈ షాక్ నుంచి కోలుకోకముందే నెల్లూరులో వైసీపీకి మరో షాక్ తగిలింది. కాగా నెల్లూరు వైసీపీ మేయర్ స్రవంతి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. వైసీపీ శ్రేణులు తనని బెదిరించినందుకే తాను గతంలో వైసీపీకి రాజీనామా చేసి మళ్లీ పార్టీలో చేరానన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరినప్పుడే మేయర్ స్రవంతి కూడా ఆయనతోపాటే ఉంటానని పార్టీ నుంచి బయటకు వచ్చారు. అయితే మళ్లీ వారం వ్యవధిలోనే ఆమె వైసీపీలో చేరారు. అలా చేరి తాను తప్పు చేశానని మేయర్ తెలిపారు.అయితే వైసీపీలో తాము ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నామని ఆమె వాపోయారు. కాగా తాము చేసిన తప్పును మన్నించి తమను అక్కున చేర్చుకోవాలని మేయర్ స్రవంతి దంపతులు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కోరారు.