రన్యారావుకు షాక్..
బంగారు బిస్కట్లతో బెంగళూరు ఎయిర్ పోర్టులో అడ్డంగా దొరికిపోయిన సినీనటి రన్యారావుకు మరోసారి కర్ణాటక హైకోర్టులో షాక్ తగిలింది. బెయిల్ కోసం రన్యారావు, మరో నిందితుడు తరుణ్ కొండూరు రాజు దాఖలు చేసిన పిటిషన్లపై తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు వారి పిటిషన్లను కొట్టివేసింది. దీనితో కాఫిఫోసా చట్టం కింద వారికి ఏడాది లోపు బెయిల్ మంజూరు కాదని అధికారులు చెప్తున్నారు. దుబాయి నుండి బంగారం అక్రమంగా తరలిస్తుండగా రన్యారావును డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. ఈ కేసులో ఆమెతో సహా ముగ్గురిని అరెస్టు చేశారు. ఆమె స్మగ్లింగ్ సహచరుడు తరుణ్ కొండూరు, ఆభరణాల వ్యాపారి సాహిల్ జైన్ కూడా అరెస్టయ్యారు.
Tollywood updates: బన్నీ అంటే ప్రేమ విజయ్ దేవరకొండకు..!

