HealthHome Page SliderNational

పాదాలను మెరిపించండిలా..

మహిళలు ముఖసౌందర్యానికి ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. కానీ పాదాల వద్దకు వచ్చేసరికి వాటిని అశ్రద్ధ చేస్తారు. సరైన జాగ్రత్త లేకపోతే పాదాలకు అనేక సమస్యలు ఏర్పడవచ్చు. ఈ సమస్యలను అధిగమించి, పాదాలను నునుపుగా అందంగా మెరిపించే చిట్కాలు కొన్ని పాటించవలసి ఉంటుంది. ఒక్కొక్కసారి అరికాళ్లలో, వేళ్ల వద్ద దురద పుట్టడం, చర్మం పొడిబారడం,దద్దుర్లు రావడం, చర్మం పొలుసులు రావడం, పగుళ్లు వంటి సమస్యలు ఏర్పడతాయి. వీటికోసం సహజంగా ఇంట్లో దొరికే పదార్థాలతోనే ఉపశమనం పొందవచ్చు.

వీటిలో ముఖ్యంగా ఉప్పునీరు పాదాలకు చక్కని మెడిసిన్‌గా పని చేస్తుంది. ఒక టబ్‌లో నీరు తీసుకుని రెండు చెంచాల ఉప్పు వేసి దానిలో పాదాలను కాసేపు నానబెడితే దురద తగ్గుతుంది. రోజూ స్నానం చేసేటప్పుడు పాదాలను ప్యూమిక్ స్టోన్‌తో శుభ్రం చేసుకుంటే మంచిది. పొడిచర్మం కారమంగా అరికాళ్లలో దురద ఏర్పడితే పెట్రోలియం జెల్లీని రాయవచ్చు. దీనివల్ల పాదాలకు మాయిశ్చరైజర్ అంది, మృదువుగా మారతాయి. కాళ్లను ఎక్కువసేపు నీళ్లలో నానబెట్టకపోవడం, ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవడం, తేమ చేరకుండా జాగ్రత్తపడడం వంటి చర్యల ద్వారా పాదాల చర్మాన్ని కాపాడుకోవచ్చు. కొన్నిసార్లు బాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా సమస్యలు రావచ్చు. అలాంటప్పుడు వైద్యుని సలహాలు తీసుకోవాలి.