లైవ్‌లో హీరోకి ప్రపోజ్ చేసింది..
లైవ్‌లో హీరో విశాల్‌కు హీరోయిన్ సాయి ధన్సిక ప్రపోజ్ చేసింది. చెన్నైలో నిర్వహించిన ఓ సినిమా ఈవెంట్‌లో సాయి ధన్సిక విశాల్ తో పెళ్లి చేసుకోనున్నట్టు ప్రకటించింది. హీరో విశాల్.. ధన్సికను వివాహం చేసుకోబోతున్నారంటూ కోలీవుడ్‌లో సోమవారం ఉదయం ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశంపై వారిద్దరూ స్పందించారు. తమ వివాహం ఆగస్టు 29న జరగనున్నట్టు ప్రకటించేశారు. దీంతో ఈ వ్యవహారం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ధన్సిక నటించిన యాక్షన్ మూవీ ‘యోగీ దా’ ఆడియో, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు విశాల్ అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమం జరగడానికి ముందే వారి రిలేషన్ షిప్ పై వార్తలు జోరందుకున్నాయి. ఈ వేడుకలోనే ఆ విషయాన్ని ప్రకటిస్తారని కూడా విశాల్ సన్నిహితులు చెబుతూ వచ్చారు.