ప్రముఖ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా మారిన షారుఖ్ కూతురు
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఇటీవల విడుదలైన పఠాన్ మూవీతో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. కాగా ప్రస్తుతం ఆయన ఈ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో షారుఖ్ ఖాన్ గారాలపట్టి సుహనా ఖాన్ తన తండ్రి సంతోషాన్ని రెట్టింపు చేసింది. కాగా ఆమె మేబెల్‌లైన్ అనే ప్రముఖ మేకప్ ప్రొడక్ట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు. అయితే తాజాగా సుహానా ఖాన్ నటించిన యాడ్‌ను మేబెల్‌లైన్ మేనేజ్‌మెంట్ రిలీజ్ చేసింది. ఈ యాడ్‌లో సుహానాను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించినట్లు మేబెల్‌లైన్ మేనేజ్‌మెంట్ ప్రకటించింది. దీనిపై షారుఖ్ ఖాన్ ట్విటర్ ద్వారా స్పందించారు. కాగా ఆయన తన కూతురుని మెచ్చుకుంటూ “లవ్ యూ మై లిటిల్ లేడి ఇన్ రెడ్” అని ట్వీట్ చేశారు.