crimeHome Page SliderNationalNews Alert

రన్యారావు బంగారం అక్రమ రవాణా కేసులో సంచలన విషయాలు..

బెంగళూరు నటి రన్యారావు బంగారం అక్రమ రవాణా విషయంలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. సీనియర్ ఐపీఎస్ అధికారి సవితి కుమార్తె కావడంతో అవకాశాలను బాగా ఉపయోగించుకున్నారు రన్యారావు. ఆమె అసలు పేరు హర్షవర్ధిని యఘ్నేష్. సినిమాల కోసం రన్యారావుగా మార్చుకున్నారు. ఆమె వెనుక పెద్ద హవాలా రాకెట్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు డీఆర్‌ఐ అధికారులు. కొందరు రాజకీయనాయకులు, అధికారులు, నటులకు సంబంధించిన నగదును హవాలా మార్గంలో దుబాయికి తరలించి, అక్కడ నుండి బంగారం కొని అక్రమంగా తరలిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.  తండ్రి హోదాను అడ్డు పెట్టుకుని ఒక కానిస్టేబుల్ సహాయంతో ఎయిర్ పోర్టులోని తనిఖీ కేంద్రాల నుండి ఈజీగా తప్పించుకుంటున్నట్లు గుర్తించారు. ఆమె అరెస్టయ్యాక ల్యావెల్లీ రోడ్డులో ఉన్న ఆమె ప్లాట్‌లో సోదాలు చేసిన పోలీసులు నివ్వెరపోయారు. ఆమె ఇంట్లో దాదాపు రూ.18 కోట్ల విలువైన రూ.2.67 కోట్ల నగదు, 14 కిలోల బంగారు బిస్కట్లు, 600 గ్రాముల ఆభరణాలు గుర్తించి, జప్తు చేశారు. స్మగ్లింగ్ చేయాలంటూ కొందరు బ్లాక్‌మెయిల్ చేసినట్లు ఆమెను విచారించిన పోలీసులకు వెల్లడించినట్లు తెలిసింది. ఆమె తండ్రి కె. రామచంద్రరావు స్పందిస్తూ ఆమె కార్యకలాపాలతో తనకు సంబంధం లేదని, 4 నెలల క్రితం వివాహం చేసుకుందని అప్పటి నుండి ఇంటికి రావడం లేదని పేర్కొన్నారు.