తమిళనాడులో హిందీపై సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం
తమిళనాడులో హిందీ ఇంపోజిషన్‌పై మళ్లీ వివాదం చెలరేగింది. హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
వివరాల్లోకి వెళ్తే – రాష్ట్రవ్యాప్తంగా హిందీ మూవీస్, పాటలు, హోర్డింగ్స్ పై నిషేధం విధించే బిల్లును ఇవాళ తమిళనాడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసే అవకాశం ఉంది.
ఈ బిల్లుకు సంబంధించిన చట్టపరమైన సవాళ్లను, రాజ్యాంగ పరిమితులను సమీక్షించేందుకు సీఎం ఎం.కే. స్టాలిన్ నిన్న రాత్రి అత్యవసర సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది.
ఇక ఈ నిర్ణయంపై బీజేపీ నేత వినోజ్ సెల్వమ్ తీవ్రంగా స్పందించారు. “ఇది ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచే మూర్ఖత్వం” అంటూ మండిపడ్డారు. తమిళ సంస్కృతి పేరుతో హిందీ వ్యతిరేకతను ప్రోత్సహించడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు.