Home Page SliderNationalNews Alert

మోదీ టూర్‌లో సెక్యూరిటీ వైఫల్యం.. ప్రధానికి పూలమాల వేయడానికి యత్నించిన వ్యక్తి

ప్రధాని మోదీ కర్ణాటక రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. హుబ్బళీలో మోదీ రోడ్‌ షో నిర్వహిస్తుండగా భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. రోడ్డు పక్కనున్న బారికేడ్లను దూకిన ఓ వ్యక్తి మోదీ కాన్వాయ్‌ వద్దకు పరిగెత్తుకుంటూ … మోదీకి పూలమాల వేయడానికి ప్రయత్నించాడు. ప్రధానికి దాదాపు ఒక అడుగు దూరం వరకు వెళ్లిపోయాడు. ఆ సమయంలో మోదీ తన వాహనం ఫుట్‌ బోర్డుపై నిల్చుని ప్రజలకు అభివాదం చేస్తున్నారు. ఈ హఠాత్తు ఘటనతో ప్రధాని సెక్కూరిటీ సిబ్బంది ఉలిక్కిపడ్డారు. అయితే అతని వద్ద నుంచి మోదీ పూలమాలను తీసుకుని కారు బ్యానెట్‌పై ఉంచారు. దీంతో ఆ వ్యక్తిని భద్రతా సిబ్బంది వెనక వైపు తీసుకెళ్లారు.