పట్టాలు తప్పిన సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్
బెంగాల్‌లోని నవాల్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే సికింద్రాబాద్-షాలిమర్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. మూడు భోగీలు పట్టాలు తప్పాయి. పలువురు ప్రయాణీకులకు గాయాలయ్యాయి. షాలిమర్ నుంచి సికింద్రాబాద్ వైపు వస్తున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ఈ తెల్లవారు ఝామున 5.31కి పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. అయితే ఘటనా స్థలానికి సమీపంలోనే రైల్వే స్టేషన్ ఉండటంతో రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. ఇతర రైళ్లను కొన్నింటిని నిలిపివేయగా మరికొన్నింటిని దారి మళ్లించారు.దీంతో బెంగాల్ నుంచి ఒడిషా మీదుగా ఏపికి,తెలంగాణాకి రావాల్సిన చాలా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పెనుప్రమాదం తప్పడంతో ప్రయాణీకులంతా ఊపిరి పీల్చుకున్నారు.


 
							 
							