తాడిపర్రులో కొనసాగుతున్న 144 సెక్షన్
బ్యానర్ల మోజు నలుగురు ప్రాణాలను బలిగొంది. పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో బ్యానర్లు కడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై 4గురు చనిపోయిన ఘటన సంచలనం సృష్టించింది.రాజకీయ ఆధిపత్య వర్గాల వారు ఈ బ్యానర్లు ఏర్పాటు చేశారు. అయితే సోమవారం నాడు బ్యానర్లు ఏర్పాటు చేసిన సమయంలో 4గురు చనిపోవడంతో తాడపర్రులో తీవ్రవిషాద ఛాయలు ఏర్పడ్డాయి. ఈ మేరకు స్థానికులు,బంధువులు ఆందోళనకు దిగారు.రెండు వర్గాల వారు పరస్పరం రాళ్లురువ్వుకోవడంతో 144 సెక్షన్ విధించారు. బుధవారం రాత్రి వరకు 144 సెక్షన్ విధింపు కొనసాగుతుందని,ఎవరు కవ్వింపు చర్యలకు పాల్పడినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరించారు.

