నిద్రిస్తున్న వ్యక్తిపై మట్టి పోసి, చంపేసిన పారిశుద్ధ్య సిబ్బంది
యూపీలోని బరేలీలో దారుణం జరిగింది. పారిశుద్ధ్య సిబ్బంది నిర్లక్ష్యంతో చేసిన పని వల్ల ఒక వ్యక్తి అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారు. తన ఇంటి సమీపంలో ఒక చెట్టు కింద సునీల్ కుమార్ ప్రజాపతి (45) అనే వ్యక్తి నిద్రిస్తుండగా, అతడిని గుర్తించకుండా ట్రాక్టర్‌తో మట్టిలోడు తెచ్చి అతనిపై పోసేశారు పారిశుద్ధ్య సిబ్బంది. దీనితో అతడు సజీవ సమాధి అయిపోయాడు. అతనని వెదకుతూ వచ్చిన అతని కుమారుడు తన తండ్రి నిద్రించిన స్థలంలో మట్టి కుప్ప ఉండడంతో స్థానికులను పిలిచి వారి సహాయంతో మృతదేహాన్ని వెలికితీశాడు. ఈ ఘటనలో సిబ్బంది నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆందోళన చేస్తున్నారు.