సంధ్య కథ ఇక కంచికే
సంధ్య థియేటర్ ఘటన ఓ కొలిక్కి వచ్చేట్లు కనిపిస్తుంది.అందరి ఇగోలు శాటిస్ ఫై అయ్యేలా దిల్ రాజు మధ్యవర్తిత్వం చేశారనిపిస్తుంది.లేదా ఈ వ్యవహారాన్ని ఇంకా సాగదీయడం ఇద్దరికి మంచిది కాదేమో అని అటు రేవంత్,ఇటు అల్లు కుటుంబాలు భావించాయోయేమోగానీ ఈ కేసు విషయంలో చర్యల దూకుడు చాలా తగ్గిందని తెలుస్తుంది.ఇందులో భాగంగా అల్లు అర్జున్ రూ.1కోటి,మైత్రీ మూవీస్ రూ.50లక్షలు,సుకుమార్ రూ.50లక్షలు చొప్పున పరిహార చెక్కులను మూవీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజుకు బుధవారం అందజేశారు. ఈ మేరకు ఆ చెక్కులను రేవతి కుటుంబ సభ్యులకు అందజేస్తామని దిల్ రాజు ప్రకటించారు.