Home Page SlidermoviesNationalviral

విడాకుల సీక్రెట్ చెప్పేసిన సమంత..

అందాల తార సమంతకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. గత కొంతకాలంగా ఆమె ఆరోగ్యం, మహిళల రక్షణ, ఆత్మవిశ్వాసం వంటి విషయాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అలాగే అలాంటి మెసేజెస్ ఉన్న పోస్టులను షేర్ చేయడం, లైక్ చేయడం ద్వారా అభిమానులకు దగ్గరవుతున్నారు. తాజాగా ఆమె విడాకులకు సంబంధించిన ఒక పోస్టును లైక్ చేయడం ద్వారా నాగచైతన్యతో విడాకులకు కారణం అదేనని చర్చించుకుంటున్నారు నెటిజన్లు. అదేంటంటే.. వైవాహిక బంధాలు విచ్ఛిన్నం కావడంపై వచ్చిన ఆ పోస్టులో అనారోగ్యంతో ఉన్న భార్యను వదిలించుకోవడానికే భర్త మొగ్గు చూపుతాడనేది దాని సందేశం. అలాగే మహిళలు మాత్రం భర్త ఆరోగ్యం ఎలా ఉన్నా ఎమోషనల్ అటాచ్‌మెంట్ కలిగి ఉంటారని అందుకే విడిపోడానికి ఇష్టపడరని ఒక సర్వేలో తేలింది. దీనికి సమంత లైక్ చేయడంతో ఆమెకు గల మయోసైటిస్ వ్యాధి కారణంగానే విడాకులు తీసుకున్నారని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.